బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. నేడు, రేపు బ్యాంకులు బంద్

by Anukaran |
banks
X

దిశ, వెబ్‌డెస్క్ : బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. నేడు, రేపు(గురు, శుక్రవారం) బ్యాంకులు బంద్ కానున్నాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్​బీయూ) పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో బ్యాంకు సేవలకు అంతరాయం కలుగనుంది.

అయితే.. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సమ్మె చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో తొమ్మిది యూనియన్లతో కూడిన ఈ ఫోరం గురువారం, శుక్రవారం(16, 17 తేదీల్లో) స్ట్రైక్​ చేయాలని నిర్ణయించింది. దీంతో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. బ్యాంకర్ల సమ్మెతో చెక్​క్లియరెన్స్ సహా.. మనీ ట్రాన్స్‌ఫర్స్‌పై తీవ్ర ప్రభావం పడనుంది.

ఇదిలా ఉండగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి వ్యతిరేకంగా తాము ఈ సమ్మె చేపడుతున్నట్లు యూఎఫ్‌బీయూ పేర్కొంది.

Advertisement

Next Story