రూ. 2 వేల కోట్లు సేకరించనున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

by Harish |
రూ. 2 వేల కోట్లు సేకరించనున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వచ్చే నెల చివరి నాటికి క్యూఐపీ ప్రాతిపదికన రూ. 2 వేల కోట్ల నిధులను సమీకరించనున్నట్టు బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఏ ఎస్ రాజీవ్ తెలిపారు. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్(క్యూఐపీ) పద్దతిలో ఈ నిధుల సమీకరణ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ. 5 వేల కోట్ల మొత్తానికి సమానమైన నిధులను క్యూఐపీ లేదా రైట్స్ ఇష్యూ ద్వారా సమీకరించేందుకు బ్యాంకు బోర్డ్ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రూ. 2 వేల కోట్లను సేకరించనున్నట్టు ఆయన వెల్లడించారు.

ఇందులో క్యూఐపీ ఇష్యూ ద్వారా రూ. 1,000 కోట్లు, గ్రీన్ షూ ఆప్షన్ ద్వారా రూ. 1,000 కోట్లను సేకరించనున్నారు. దీంతో బ్యాంకులో ప్రభుత్వ వాటా 94 శాతం నుంచి 85 శాతానికి తగ్గిపోనుంది. సమీకరించే నిధులతో బ్యాంకు కార్పొరేట్ రుణ విలువను రూ. 40 కోట్లు ఉండగా, దాన్ని అదనంగా మరో రూ. 10 వేల కోట్లు పెంచాలని బ్యాంకు యాజమాన్యం నిర్ణయించింది. రానున్న రోజుల్లో మెరుగైన ఎంఎస్ఎంఈ, ఫార్మా, ఇన్‌ఫ్రా సంస్థలకు రుణాలిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed