జాతీయ రహదారిపై బ్యాంకు ఉద్యోగుల నిరసన

by Shyam |
జాతీయ రహదారిపై బ్యాంకు ఉద్యోగుల నిరసన
X

దిశ, మక్తల్ : ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగస్తులు167జాతీయ రహదారి‌పైకి వచ్చి ధర్నా చేసి నిరసన తెలిపారు. నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో శ్రవారం ధర్నా నిర్వహించారు. వీరికి ఐఎఫ్టీయూ నాయకుడు బుట్టో, జిల్లా నాయకుడు కొండయ్య, రాష్ట్ర బీసీ సంఘం నాయకుడు రామాంజనేయులు గౌడ్, పీడీఎస్యూ రాష్ట్ర నాయకుడు బాస్కర్ మద్దతు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కేనరా బ్యాంకులు మూత పడేస్థాయికి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడానికి నిరసనగా, దేశ వ్యాప్తంగా బ్యాంకు సిబ్బంది రెండు రోజులపాటు విధులను బహిష్కరిస్తూ నిరసన తెలుపుతున్నారు. బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల రైతులకు పొదుపు ఖాతాలో డబ్బులు జమ చేయడానికి సామాన్య రైతులు బ్యాంకు ముఖం చూడడానికి వీలు లేకుండా ఉంటుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కార్పొరేట్ వారికి అనుకూలంగా ఉంటుందని అందువలన నిర్ణయాన్ని వెనక్కు తీసుకో వాలని నర్సింహులు అన్నారు.

ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణ చేస్తే ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని, ఆర్థిక మాద్యం వచ్చిన సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిన భారత దేశంలో ప్రభావం ఏమాత్రం లేదని అందుకు పటిష్టమైన బ్యాంకు వ్యవస్థే కారణమని సీపీఐ నాయకుడు కొండయ్య అన్నారు. దేశ ఆర్థిక పురోగతికి బ్యాంకింగ్ వ్యవస్థ ముఖ్యమని ప్రభుత్వ రంగ చేతిలో బ్యాంకింగ్ అనుసంధానం ఉండాలని ఆయన అన్నారు.

ఆర్థిక నేరగాళ్లను పట్టుకోకుండా కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను నవీకరించడానికి, ప్రైవేట్ పరం చేయడా నికి పూనుకోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి నర్సిములు, యూనియన్ బ్యాంక్ సిబ్బంది, UFBU, ఎఐబీఇఎ యూనియన్ నాయకులు అనిల్ కుమార్, సంజీవ మెహర్, ప్రదీప్ మెహర్, వెంకటేశ్, ఎస్బీఐ సిబ్బంది పవన్, వెంకటేశ్, నవీన్ జగదీష్, వి.మదుసుధన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed