- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినీ ఫక్కీలో హీరోయిన్ అరెస్ట్.. లైవ్ టెలికాస్ట్
దిశ, సినిమా : బంగ్లాదేశ్ యాక్ట్రెస్ పోనీ మోరి అలియాస్ స్మృతి శ్యామ్‌సున్నహర్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ సైట్స్‌లోనూ మిలియన్ ఫాలోవర్స్‌ను కలిగిన భామ.. 28 ఏళ్ల వయసులోనే కోటీశ్వరురాలిగా చలామణి అవుతోంది. కాగా ఈమెను సినిమాటిక్ వేలో అరెస్ట్ చేసింది యాంటి టెర్రరిజమ్, యాంటి క్రైమ్ స్పెషల్ ఫోర్సెస్ రాపిడ్ యాక్షన్ బెటాలియన్. తన ఇంట్లో భారీ మొత్తంలో లిక్కర్‌తో పాటు నార్కొటిక్స్ స్వాధీనం చేసుకున్న ఫోర్స్.. అనైతిక కార్యకలాపాల ద్వారానే తను ఇంత పెద్ద మొత్తంలో ప్రాపర్టీస్ సంపాదించినట్లు తెలిపింది. గత నెలలో ఓ క్లబ్‌పై దాడి చేసిన పోనీ మోరి అండ్ టీమ్.. బార్‌ను పూర్తిగా ధ్వంసం చేశారని యాజమాన్యం కేసు పెట్టింది. దీనిపై విచారించిన పోలీసులు ఇంతకు ముందే ఇద్దరు మోడల్స్ నివాసాలపై దాడి చేసి నిషేధిత డ్రగ్స్, మద్యం స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిని అరెస్ట్ చేశారు. కాగా మూడు రోజుల తర్వాత పోనీ మోరీ ఇంటిపై దాడి చేసిన ఫోర్స్ తనను అదుపులోకి తీసుకుంది. ఆమె మల్టీ స్టోరీడ్ బిల్డింగ్‌లోని ఓ ఫ్లోర్ పూర్తిగా లిక్కర్, ఇతరత్రా మాదక ద్రవ్యాలతో నిండి ఉంది. ఈ ఘటనను దేశవ్యాప్తంగా అన్ని చానళ్లు లైవ్ ప్రసారం చేయగా.. తన చేతులను వెనక్కి కట్టి మరి అదుపులోకి తీసుకుంది స్పెషల్ ఫోర్స్.
కాగా జూన్ 14న తనపై అత్యాచారం, హత్య వంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించిన నటి.. తనను కాపాడాలంటూ బంగ్లాదేశ్ ప్రధానిని కోరిన విషయం తెలిసిందే. ఈ కేసులో బిజినెస్‌మెన్, ఫుట్ బాల్ ప్లేయర్‌తో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాగా వారు 18 రోజుల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు.