తొలిసారిగా బంగ్లాదేశ్ ట్రూపుల పరేడ్

by Shamantha N |
తొలిసారిగా బంగ్లాదేశ్ ట్రూపుల పరేడ్
X

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ఆవిర్భావానికి సహకరించిన మనదేశానికి కృతజ్ఞతగా ఈ సారి భారత గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పొరుగుదేశ ట్రూపులు పరేడ్ చేయనున్నాయి. బంగ్లాదేశ్‌కు చెందిన 122 మంది సిబ్బంది ఈ నెల 26న రాజ్‌పథ్‌లో పరేడ్ చేయనున్నారు. భారత గణతంత్రంలో పాల్గొనడానికి గర్వపడటమే కాకుండా, ఈ దేశ సహకారానికి కృతజ్ఞతగా ఈ పరేడ్‌లో వారు భాగస్వాములవుతున్నారు. భారత 72వ గణతంత్ర వేడుకల్లో భాగమవ్వడం గర్వంగా ఉన్నదని బంగ్లాదేశ్ ఆర్మీ కల్నల్ మొహతషిమ్ హైదర్ చౌదరి తెలిపారు.

1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటాన్ని స్వయంగా చూసిన వయస్కులే ఈ సిబ్బందిలో ఉన్నారని వివరించారు. బంగ్లాదేశ్ పిత షేక్ ముజీబుర్ రెహ్మన్ 100వ జయంతి, బంగ్లాదేశ్ 50వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న సంవత్సరంలోనే ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు. విదేశీ ట్రూపులను భారత పరేడ్‌లోకి అనుమతించడం ఇది మూడో సారి. 2016లో ఫ్రెంచ్ ట్రూపులు, 2017లో యూఏఈ బలగాలు భారత్ గణతంత్ర వేడుకల్లో పాలుపంచుకున్నాయి.

Advertisement

Next Story