బంగ్లాదేశ్ తర్వాతి స్థానంలో భారత్ : ఐఎంఎఫ్

by Shamantha N |
బంగ్లాదేశ్ తర్వాతి స్థానంలో భారత్ : ఐఎంఎఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: 2020 ఆర్థిక సంవత్సరంలో కొవిడ్-19 వ్యాప్తి, లాక్‌డౌన్ వల్ల తలసరి జీడీపీలో భారత్‌ను బంగ్లాదేశ్ అధిగమిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) తన వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ నివేదికలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ 10.3 శాతం ప్రతికూలంగా ఉంటుందని, తర్వాతి ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8.8 శాతం వృద్ధిని సాధిస్తుందని ఐఎంఎఫ్ అంచనాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ప్రస్తుత క్యాలెండర్ ఏడాదికి భారత్ తలసరి జీడీపీ బంగ్లాదేశ్ కంటే తక్కువగా ఉంటుందని తెలిపింది.

2020లో బంగ్లాదేశ్ తలసరి జీడీపీ 1,888 డాలర్లతో 4 శాతం వృద్ధిని సాధిస్తుందని, భారత్ మాత్రం 1,877 డాలర్లకు పడిపోతుందని వివరించింది. ఈ గణాంకాల ప్రకారం..దక్షిణాసియలోనే భారత్‌ మూడో అత్యంత పేద దేశంగా నిలవనుందని వెల్లడించింది. భారత్ కంటే మెరుగ్గా బంగ్లాదేశ్‌తో పాటు భూటాన్, శ్రీలంక, మాల్దీవులు ఉండనున్నాయని, దక్షిణాసియాలో పాకిస్తాన్, నేపాల్ తర్వాత భారత్ ఉండనుందని ఐఎంఎఫ్ తెలిపింది. వచ్చే ఏడాదిలో భారత్ ఆర్థిక రికవరీ సాధించే అవకాశాలున్నాయని, అంచనాలు నిజమైతే 2021కి తలసరి జీడీపీలో బంగ్లాదేశ్‌ను దాటి భాగర్ అధిగమిస్తుందన్ని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది.

Advertisement

Next Story

Most Viewed