సోలార్ పవర్ ప్లాంట్లు కావాలి.. కేంద్రమంత్రికి బండి సంజయ్ లేఖ

by Sridhar Babu |
bandi sanjay
X

దిశ, కరీంనగర్ సిటీ: దిగువ, మధ్య మానేరు ప్రాజెక్టులపై సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఇంధన, పునరుత్పదాక శాఖ మంత్రి రాజ్ కమార్ సింగ్‌కు బుధవారం లేఖ రాశారు. మానేరు నదిపై ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్ నిర్మాణం ద్వారా ఆనకట్టల నుండి నీటి ఆవిరిని తగ్గిస్తుందని, నీటి ఎద్దడికి గురయ్యే ప్రాంతాలకు ఇది ప్రత్యేకించి ప్రయోజనకరమన్నారు. ప్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటుకు భూ భాగం అవసరము లేదని, పరిమిత స్థలంలోనే ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ఆయా ప్రాజెక్టులపై ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లను మంజూరు చేయాల్సిందిగా ఆ లేఖలో కోరారు.

Advertisement

Next Story

Most Viewed