- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ రజాకారుల రాజ్యం అయ్యింది: బండి సంజయ్
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని, తెలంగాణ రజాకార్ల రాజ్యం అయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వరంగల్‌లో ఎంపీ ధర్మపురి అరవింద్‌పై దాడిని ఖండించిన ఆయన… పథకం ప్రకారమే కుట్రపన్ని టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారన్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, కేరళలో పినరయి విజయన్ పాలన మాదిరిగా.. రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలన నడుస్తోందన్నారు. విధుల్లో ఉన్న ఇన్‌స్పెక్టర్ కనుసన్నల్లోనే బీజేపీ ఎంపీపై దాడి చేశారని ఆరోపించారు. అరాచకాలు, దాడుల పంథానే కేసీఆర్ ప్రభుత్వం కొనసాగిస్తే ప్రజాస్వామ్య వాదులుగా బీజేపీ ప్రజా పోరాటాలను చేస్తుందన్నారు.
కేసీఆర్ ఆదేశాలతో జరుగుతున్న దాడులకు.. దాడులే సమాధానం అయితే టీఆర్ఎస్ నాయకుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. దాడులకు ప్రతిదాడులు బీజేపీకి కొత్తకాదన్నారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, భూ కబ్జాలపై బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా నిలదీయడం మా బాధ్యత అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమవుతుండటంతోనే.. భయంతో ఎంపీ అరవింద్‌పై టీఆర్ఎస్ దాడులకు పాల్పడిందన్నారు.