నా దేవుడితో మరోసారి : బండ్ల

by Jakkula Samataha |
నా దేవుడితో మరోసారి : బండ్ల
X

దిశ, వెబ్‌డెస్క్: ‘గబ్బర్ సింగ్’ టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసింది. రికార్డులు తిరగరాస్తూ నిర్మాత బండ్ల గణేష్‌కు కాసుల వర్షం కురిపించింది. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా బండ్ల గణేష్ లైఫ్‌నే మార్చేయగా.. నిర్మాతగా ఆ చాన్స్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిపోయాడు బండ్ల. అప్పటి నుంచి పవన్‌ను దేవుడితో సమానంగా కొలుస్తున్నాడు. కానీ ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అయిపోయిన పవన్.. ఈ మధ్యే సినిమాలకు సైన్ చేస్తున్నారు. వకీల్ సాబ్‌తో పాటు క్రిష్‌తో ఒక సినిమా, డైరెక్టర్ హరీష్ శంకర్‌తో మరో సినిమా చేస్తున్నారు.

కాగా, ఇప్పుడు మళ్లీ తన దేవుడు తనతో సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు బండ్ల గణేష్. పవన్ 30వ చిత్రం తన నిర్మాణ సారథ్యంలోనే ఉండబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. దీంతో గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని.. మరో ట్రెండ్ సెట్టింగ్ మూవీ ఖాయమని అప్పుడే అంచనా వేస్తున్నారు అభిమానులు. కాగా త్వరలో కాస్ట్ అండ్ క్రూ గురించిన వివరాలు వెల్లడించనున్నారు బండ్ల.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed