- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గల్ఫ్ కార్మికులను స్వదేశానికి తీసుకురావాలి : బండి సంజయ్
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృత వ్యాప్తిని అరికట్టడానికి అనేక దేశాలు లాక్‌డౌన్ విధించుకున్నాయి. దీంతో ఉపాధి నిమిత్తం వెళ్లి, విదేశాల్లో చిక్కుకుపోయిన కార్మికులను స్వదేశానికి తీసుకురావాలని బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం ఆయన కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వి.మురళీథరన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డిలకు లేఖ రాసారు. తెలంగాణ ప్రాంతం నుంచి బతుకు దెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లినవారు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి స్వదేశానికి రాలేక గల్ఫ్‌లోనే చిక్కుకుపోయారని పేర్కొన్నారు. స్వదేశాల్లో ఉంటున్న వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ‘వందేభారత్ మిషన్’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి, గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తెలంగాణవాసులను స్వదేశానికి తరలించేందుకు సహకరించాలని బండి సంజయ్ లేఖ కోరారు.