- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ టూర్‌కు బండి సంజయ్ హాజరు కావాలి
దిశ ప్రతినిధి, కరీంనగర్: మంత్రి కేటీఆర్ మంగళవారం కరీంనగర్‌లో పర్యటించనున్నట్టు స్థానిక మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అయితే ఈ పర్యటనలో స్థానిక ఎంపీ బండి సంజయ్ కూడా హాజరు కావాలని గంగుల కమలాకర్ కోరారు. మీడియా ద్వారా కూడా ఆయనను ఆహ్వానిస్తున్నామని, అభివృద్ది కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ఆయన సూచించారు. సోమవారం కరీంనగర్‌లో మంత్రి గంగుల మీడియాతో మాట్లాడుతూ… జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా హాజరు కావాలన్నారు. కరీంనగర్‌లో జరిగే ఐదు కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొంటారని, హరితహారం కార్యక్రమంలో భాగంగా గతం సీఎం కేసీఆర్ మొక్కలు నాటిన చోటే కేటీఆర్ కూడా మొక్కలు నాటుతారన్నారు. అనంతరం అర్బన్ మిషన్ భగీరథ కార్యక్రామన్ని ప్రారంభిస్తారని ఐటీ టవర్‌ను ప్రారంభిస్తారని చెప్పారు, సస్పెన్షన్ బ్రిడ్జి పనులను పరిశీలించడంతో పాటు కరీంనగర్ పోలీసులు ఏర్పాటు చేసిన మియావాకి విధానంతో చిట్టడవులను పెంచే ప్రాంతాన్ని సందర్శించి అక్కడ కూడా మొక్క నాటుతారని వివరించారు. స్మార్ట్ సిటీలో భాగంగా రోడ్ల నిర్మాణం తీరుని పరిశీలించిన తరువాత నగరాభివృద్ధికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను తిలకిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమం అంతా కూడా కోవిడ్ 19 నిభందనలకు అనుగుణంగా జరుగుతుందని, ఇందులో అందరూ పాలుపంచుకోవాలని సూచించారు.