‘బిడ్డా కేసీఆర్… నీ ఫాం హౌజ్ కు వస్తా.. తరిమి తరిమి కొడ్తా’

by Anukaran |   ( Updated:2023-10-10 11:51:02.0  )
Bandi Sanjay
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ నీకు కుటుంబం ఉంది. నీ కుటుంబానికి ఇలాంటి సమస్య వస్తే ఇలాగే చేస్తావా?. అసలు ముఖ్యమంత్రికి మానవత్వం ఉందా?. ముఖ్యమంత్రికి సోయి ఉందా అనే అనుమానం వస్తోంది. పోలీసులు, ప్రభుత్వానికి బీజేపీ నేతలను అడ్డుకునే దమ్ము లేదు. నీ ప్రగతి భవన్‌లోకి చొరబడి నీ గల్లాపట్టి బయటకు గుంజుకొస్తాం బిడ్డా కేసీఆర్. మంచిగా చెబితే ముఖ్యమంత్రికి అర్ధం కావడం లేదు. రిక్వెస్ట్ చేసినా.. మా కార్యకర్తలను వదిలిపెట్టడం లేదు. భైంసాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని. మహారాష్ట్ర నుంచి బహిష్కరించిన వారే భైంసాలో ఉన్నారు. ప్రభుత్వం ఒకే వర్గానికి కొమ్ముకాస్తోంది. హిందూవులను హింసిస్తోంది. ప్రభుత్వం పోలీసులను ఎంఐఎం చెప్పచేతల్లో పెట్టింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నమ్మలేకనే గవర్నర్‌ను సంప్రదించాం.’’ అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed