- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌పై మరోసారి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా, ఆయన ఇటీవల చేపట్టిన ఢిల్లీ టూర్‌పైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన కామెంట్లు చేశారు. “నన్ను నా కుటుంబాన్ని జైలుకు పంపొద్దంటూ కేంద్ర పెద్దలకు మొరపెట్టుకున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ విషయంలో పొర్లు దండాలు పెట్టారు. మెత్తబడి ఫామ్‌హౌజ్‌లో పడుకున్నారు. అయినా కేసీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను విడిచిపెట్టేది లేదు” అని శనివారం ఢిల్లీలో వ్యాఖ్యానించారు. అవినీతిని తవ్వితీస్తున్నాం, కేసీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయం అని తరచూ కామెంట్ చేస్తున్న బండి సంజయ్ ఇప్పుడు ఢిల్లీ నుంచే కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ఇంతకాలం పట్టించుకోకుండా పక్కన పెట్టిన కేసీఆర్ హఠాత్తుగా వాటిని అమలు చేయడానికి సిద్ధమయ్యారని, దానికి కారణం ఢిల్లీ పర్యటన తర్వాత మెత్తబడడమేనని అన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయన్న ఉద్దేశంతోనే అనివార్యంగా అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చారని తెలిపారు. బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణతో టీఆర్ఎస్ దిక్కుతోచని స్థితలో పడిందని, ఇక ఆ పార్టీ తన ఎమ్మెల్యేలను కాపాడుకోడానికే పడరాని పాట్లు పడుతోందన్నారు.
స్థానిక సంస్థలు నిర్వీర్యం
కేసీఆర్ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమవుతున్నాయని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఉద్దేశపూర్వకంగానే స్థానిక సంస్థలను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే సీఎంకు సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్‌పీటీసీలు గుర్తుంటారని ఆరోపించారు. స్థానిక సంస్థల అభివృద్ధికి ఒక్క పైసా కూడా ఆయన కేటాయించలేదని, పల్లెల్లో జరుగుతున్న రైతువేదిక, శ్మశాన వాటికలు, పంచాయతీలకు ట్రాక్టర్లు.. ఇలాంటివాటికి ఖర్చుచేస్తున్న డబ్బులన్నీ కేంద్రానివేనన్నారు. గ్రామాలపై ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా సమీక్షించలేదని, బాధలు పడుతున్న స్థానిక ప్రజా ప్రతినిధులతో మాట్లాడలేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సర్పంచ్‌లపై కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి అసంతృప్తులతోనే నిజామాబాద్, డిచ్‌పల్లి ప్రాంతాలకు చెందిన పలు స్థాయిల్లోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారని అన్నారు. ఒకటి రెండు రోజుల్లో లాంచనంగా వీరు పార్టీలో చేరుతారని తెలిపారు.