- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంగారెడ్డి వేదికగా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
దిశ ప్రతినిధి, మెదక్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో రోజు ద్విగ్విజయంగా కొనసాగింది. మంగళవారం సంగారెడ్డి వేదికగా సంజయ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ‘టీఆర్ఎస్ పాలనలో బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారు. రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్ వల్ల బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందకుండా పోతున్నాయి. మతపరమైన రిజర్వేషన్లు ఇస్తానన్నావు, ఎందుకు ఇవ్వలేదు? మతపరమైన రిజర్వేషన్లు పంపి ఏం సాధించినవ్? అక్కడున్నది మోదీ ప్రభుత్వం. పేదలైన ఎస్టీ బిల్లు మాత్రం పంపలేదు. టీఆర్ఎస్ వల్ల వాళ్లంతా ఇబ్బంది పడుతున్నారు. టీఆర్ఎస్ పాలనలో బీసీలు తీవ్రంగా నష్టపోతున్నరు. బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదు… కానీ మా ఎస్సీ, బీసీ, పేదలకు అడ్డొస్తే తిరగబడి తీరుతాం’ అని హెచ్చరించారు.
తెలంగాణలో మోదీ సంక్షేమ ఫలాలు అందాలంటే బీజేపీ రావాలి. 2023లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం. ఉత్తర ప్రదేశ్ మాదిరిగానే మొట్ట మొదటి సారిగా జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చి తీరుతాం. ‘‘ఒక్కరు చాలు…ఇద్దరు హద్దు…ముగ్గురు అసలే వద్దు’ ఇదే మా నినాదం.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంను గెలిపించడానికి ఇద్దరుకంటే ఎక్కువ సంతానం ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తూ కేసీఆర్ చట్టం తీసుకురావాలని చూశారు. బీజేపీ అడ్డుకోవడంతో భయపడి వెనక్కు తగ్గిండు. దమ్ముంటే బిల్లు పెట్టి చూడు. ఎక్కడ అడ్డుకోవాలో…అక్కడ అడ్డుకుని తీరుతాం’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
- Tags
- bandi sanjay
- modi