మా కార్పొరేటర్లకు రూ.5కోట్ల చొప్పున ఆఫర్ చేస్తున్నారు: సంజయ్

by Shyam |
మా కార్పొరేటర్లకు రూ.5కోట్ల చొప్పున ఆఫర్ చేస్తున్నారు: సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని గుర్తించి ఆదరాబాదరాగా ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల కమిషన్.. మేయర్ ఎన్నికను ఎందుకు చేపట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. రూ.5కోట్లు ఇస్తాం..టీఆర్ఎస్‌లోకి రావాలని బీజేపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు, సంఘ విద్రోహ శక్తులను గుర్తించాలంటే ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని కోరారు. అలా చేస్తే కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు గుర్తించి వారిని అరెస్ట్ చేస్తారన్నారు. ఓల్డ్ సిటీలో ఉన్న రోహింగ్యాలను గుర్తించడంలో టీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా విఫలం అయ్యిందని, కేసీఆర్‌కు చిత్తశుద్ధి వెంటనే సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్న సంజయ్.. ఆ తర్వాత పాదయాత్ర చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఖమ్మం, వరంగల్, సిద్దిపేట కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్ నేతలు.. బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని వ్యాఖ్యానించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.

Advertisement

Next Story