చేనేత రంగాన్ని విస్మరించారు: బండి సంజయ్

by Shyam |
చేనేత రంగాన్ని విస్మరించారు: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగాన్ని విస్మరించిందని బండి సంజయ్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షులు, ఎం.పి బండి సంజయ్ కుమార్ హైదరాబాద్‌లో ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేనేత రంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్ర స్థాయిలో రూ. 1000 కోట్లతో చేనేత కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. నేసిన వస్త్రాలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారు. ఆధునిక ఫ్యాషన్ రంగానికి అనుగుణంగా పోటీని తట్టుకునేలా.. ఉత్పత్తి రంగాన్ని తీర్చిదిద్దేందుకు ఒక పరిశోధనా సంస్థను తీసుకురావాలన్నారు.

అలాగే, ఆత్మహత్యలు చేసుకుంటున్న బాధిత చేనేత కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాల పిల్లలను ప్రభుత్వ ఖర్చుతోనే చదివించాలని చెప్పారు. వలసలను ఆపాలంటే చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. చేనేత రంగానికి కేంద్రం అధిక మొత్తంలో నిధులు ఇస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు అంతంత మాత్రమే అని బండి సంజయ్ విమర్శించారు.

Advertisement

Next Story