ఎమ్మెల్సీ కవిత, బండి సంజయ్ మాటామంతీ (ఫొటో వైరల్)

by Anukaran |
Bandi Sanjay, MLC Kavitha
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయ నాయకులు అంటేనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మనం తరచూ చూస్తుంటాం. ప్రస్తుతం తెలంగాణలో బద్ధ శత్రువుల మాదిరి బీజేపీ-టీఆర్ఎస్‌ నేతలు ఘాటుగా విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హుజురాబాద్ ఉప ఎన్నికను ఈ రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రోజూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు మంత్రి కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత సైతం సమయం దొరికినప్పుడల్లా బీజేపీ విమర్శలకు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. అయితే.. తాజాగా.. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో హర్యాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ – బలయ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల నుంచి అనేకమంది రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. అంతేగాకుండా.. ఎప్పుడూ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకునే వీరిద్దరూ పక్కపక్కనే కూర్చోవడం అందరినీ ఆకర్షించింది. అక్కడకు వచ్చిన వారి దృష్టి మొత్తం ఆ ఇద్దరిపైనే పడింది. ఈ క్రమంలో వారిద్దరూ మాట్లాడుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారాయి.

Advertisement

Next Story