- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హిందువుల పై సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్..
దిశ, అంబర్ పేట్ : రాష్ట్రంలో 80శాతం ఉన్న హిందువులు తాము హిందువులని చెప్పుకోవడానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేదార్నాథ్ ఆలయంలో ఆది శంకరాచార్యుల విగ్రహ పునర్ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నల్లకుంట లోని శంకర్ మఠంలో ప్రత్యక్ష ప్రసారాన్ని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోడీ లేకుంటే 370 ఆర్టికల్ తో పాటు అయోధ్య రామ మందిరం నిర్మాణం జరిగేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో కొన్ని దేవాలయాల్లో ధూప దీపనైవేద్యాలు కూడా లేవని విమర్శించారు.
భగవత్ స్వరూపుడైన ఆది శంకరాచార్యులు లోకకళ్యాణం కోసం జీవితాన్ని ధారపోశారని పేర్కొన్నారు. అనంతరం శంకర మఠం శారదాంబ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు, శంకరాచార్యుల ప్రవచనాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హైదరాబాద్ సెంటర్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కూన శ్రీశైలం గౌడ్, స్థానిక కార్పొరేటర్లు అమృత, కన్నె ఉమారాణి, పద్మ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.