- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుమతులిచ్చిన వారిని శిక్షించరా..?
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: టీఆర్‌ఎస్ ప్రభుత్వం దోపిడీలో నంబర్ వన్‌గా ఎదిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. సోమవారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమంలో నంబర్ వన్ అని చెప్పుకోవడం సరికాదన్నారు. సాధారణంగా 80 గజాలలోపు నివాస స్థలమున్న పేదలకు ఎలాంటి అనుమతులుండవని, అయితే ప్రస్తుతం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌లో వారిని కూడా చేర్చడం సీఎం కేసీఆర్ ప్రభుత్వ అనాలోచిత విధానాలకు నిదర్శనమన్నారు. ప్రస్తుత పరిస్థితిని అధిగమించేందుకు పేదలు, మధ్య తరగతి వారిపై ఎల్‌ఆర్‌ఎస్ స్కీంను బలవంతంగా రుద్దడమేనని విమర్శించారు. గ్రామ పంచాయతీలు, స్థానిక పట్టణ సంస్థలు అనుమతులిచ్చిన లేఅవుట్లు అక్రమమైతే వాటిలోని ప్లాట్లకు అనుమతులు మంజూరు చేసిన వారిని, ప్రభుత్వాలను శిక్షించరా? అని ఆయన ప్రశ్నించారు.
Advertisement
Next Story