- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్ విద్యార్థుల చావులకు కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యమే కారణం : బండి సంజయ్
దిశ, వెబ్‌డెస్క్ : ఇంటర్ ఫలితాలపై తెలంగాణలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రిజల్ట్స్ అనంతరం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ప్రభుత్వం తప్పిదం వల్లే ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సంజయ్ ఆరోపించారు.
కరోనా సమయంలో ఆన్‌లైన్ క్లాసులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బండి విమర్శించారు. ఫెయిలైన విద్యార్థుల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులే ఉండటం దీనికి నిదర్శనమని అన్నారు. తమ ఆత్మహత్యలకు టీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆరే కారణమంటూ ఓ విద్యార్థి స్వయంగా ట్వీట్ చేయడం సంచలనంగా మారిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి, నిర్లక్ష్యం కారణంగా ఇంకా ఎంత మంది విద్యార్థులు చనిపోవాలని నిలదీశారు.
గతంలో కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా నిర్వాకానికి 27 మంది ఇంటర్ విద్యార్థులు బలయ్యారని ఆయన ఆరోపించారు. ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉచితంగా రీ-వాల్యూయేషన్ చేయించాలని విద్యాశాఖను కోరారు. విద్యార్థులకు న్యాయం చేయకపోతే పోరాటం చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు.