- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాదాద్రిలో తేల్చుకుందాం.. వస్తారా? కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్
దిశ, జమ్మికుంట: టీఆర్ఎస్ వల్లే దళిత బంధు ఆగిందని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని, బీజేపీ వల్లే ఆగిపోయినట్టు నిరూపిస్తారా? అని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రశ్నించారు. బుధవారం కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ… ‘బీజేపీ పార్టీ లేఖ రాయడం వల్లే ‘దళిత బంధు’ పథకం ఆగిపోయిందని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ చేస్తున్నా. మా ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్దకు రావాలి. నేను కూడా అక్కడికి వస్తా’ అని అన్నారు.
టీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసి కేసీఆర్ దొంగ నాటకాలకు తెరలేపారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పతనం ఖాయమైందన్నారు. బీజేపీని గెలిపిస్తే కేసీఆర్ మెడలు వంచి దళిత బంధు సహా అన్నీ ఇప్పిస్తామని ప్రకటించారు. టీఆర్ఎస్ వల్లే ‘దళిత బంధు’ పథకం ఆగిపోయిందని తాను నిరూపిస్తే రాజీనామా చేస్తావా? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. ఒకవేళ బీజేపీ వల్లే పథకం ఆగిపోయిందని నిరూపిస్తే తాను దేనికైనా సిద్దమని కేసీఆర్ కు సవాల్ విసిరారు.