- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్ ఒక్క ఇషారా చేస్తే వారి భరతం పడతాం.. బాల్క సుమన్ హెచ్చరిక
దిశ, తెలంగాణ బ్యూరో: చిల్లరగాళ్లంతా బీజేపీలో చేరారని, సభ్యత సంస్కారం లేదని, ధాన్యం కొనుగోళ్లపై మాటలతో అయోమయానికి గురిచేస్తున్న బీజేపీ నేతల నాలుకలను రైతులే చీరుస్తారు జాగ్రత్త అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హెచ్చరించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, సైది రెడ్డి ,జె. సురేందర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంను లొట్టపీసు చట్టం అన్న ఎంపీ అరవింద్ పై అన్ని పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టాలని దళిత, గిరిజనులకు పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు బండి సంజయ్, అరవింద్ సభ్యత, సంస్కారాలు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అరవింద్ ఎంపీనని మరచిపోయి బజారు భాష వాడుతున్నారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ అన్ని విషయాలు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారని, రైతుల పక్షాన సీఎం కేసీఆర్ ఆవేదనతో కేంద్రమంత్రిని రండ అనడంలో తప్పేమీ లేదని సమర్ధించారు. బండి, ధర్మపురి శృతిమించి మాట్లాడితే తెలంగాణ రైతులు బట్టలూడదీసి కొడతారు జాగ్రత్త అని హెచ్చరించారు. తెలంగాణ రైతుల మీద కేంద్రం, బీజేపీ కక్ష కట్టినట్టు కనిపిస్తోందని, అసలు విషయాల మీద మాట్లాడకుండా కేసీఆర్ ను ఏక వచనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. థర్డ్ క్లాస్ నేతలుగా బీజేపీ ఎంపీలు మారిపోయారన్నారు. కేసీఆర్ ఒక్క ఇషారా చేస్తే వారి భరతం పడతామని, ఓపికతో వారు బతికి పోతున్నారన్నారు. కేసీఆర్ ను విమర్శించే స్థాయి వారికి లేదన్నారు.
- Tags
- Balka Suman
- bjp