దుర్గమ్మను దర్శించుకున్న బాలయ్య

by Anukaran |   ( Updated:2021-12-14 23:15:13.0  )
దుర్గమ్మను దర్శించుకున్న బాలయ్య
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి నటసింహం నందమూరి బాలకృష్ణ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో బాలయ్యకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. బాలయ్యకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. దర్శనం అనంతరం బోయపాటితో కలిసి బాలయ్య మీడియాతో మాట్లాడారు. అఖండ సినిమా విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. సినిమాను ఆదరించినందుకు ప్రేక్షకులకు బాలయ్య ధన్యవాదాలు చెప్పారు. కాగా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామిని బాలయ్య దర్శించుకోనున్నారు.

Advertisement

Next Story