ఒక్క దెబ్బకు.. స్వర్ణ పతకం, నెంబర్ వన్ ర్యాంక్

by Shiva |
ఒక్క దెబ్బకు.. స్వర్ణ పతకం, నెంబర్ వన్ ర్యాంక్
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా ఒకే దెబ్బకు స్వర్ణపతకం గెలవడమే కాకుండా ప్రపంచ ర్యాంకింగ్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇటలీ రాజధాని రోమ్‌లో జరుగుతున్న మాటియో పెలికొన్ ర్యాంకింగ్ సిరీస్ 65 కేజీల విభాగం ఫైనల్ మ్యాచ్‌లో మంగోలియాకు చెందిన తుల్గా తుమర్ ఒచిర్‌తో పోటీ పడ్డాడు. మ్యాచ్ ఆరంభంలోనే ఒచిర్ సరైన పట్లు పట్టి భజరంగ్‌పై 2-0 ఆధిక్యంలోకి దూసుకొని వెళ్లాడు. ఇక మ్యాచ్ మరి కొన్ని క్షణాల్లో ముగుస్తుందనగా భజరంగ్ ఒక్కసారిగా ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. ప్రత్యర్థిపై డిఫెన్స్ ప్రదర్శిస్తూనే ఆఖర్లో 2 పాయింట్లు సాధించాడు. దీంతో 2-2తో స్కోర్ సమం అయ్యింది.

మ్యాచ్ నిబంధనల ప్రకారం ఆఖర్లో ఎవరు పాయింట్లు సాధిస్తే వారే విజేతగా నిలుస్తారు. దీంతో భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా ఫైనల్‌లో గెలిచి స్వర్ణ పతకం అందుకున్నాడు. ఈ టోర్నీలో వరల్డ్ 2వ నెంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన భజరంగ్.. నెంబర్ వన్ ర్యాంక్ అందుకున్నాడు. ఇప్పటికే మహిళల విభాగంలో వినేష్ ఫొగట్ స్వర్ణ పతకం, సరిత మోర్ రజత పతకం గెలుచుకున్నాడు. పురుషుల 70 కేజీల విభాగంలో విశాల్ కాళీరమణ కాంస్య పతకం సాధించాడు.

Advertisement

Next Story