- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బజాజ్ ఫైనాన్స్ త్రైమాసిక లాభం రూ. 948.10 కోట్లు!
దిశ, వెబ్‌డెస్క్: ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజ సంస్థ బజాజ్ ఫైనాన్స్ మార్చి 31తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో నికర లాభం 19.38 శాతం క్షీణించి రూ. 948.10 కోట్ల రూపాయలుగా నమోదైనట్టు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో రూ. 1,176 కోట్ల రూపాయలుగా ఉంది. 2020 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఏకీకృత నికర లాభం 32 శాతం వృద్ధితో రూ. 5,264 కోట్లకు చేరినట్టు బజాజ్ ఫైనాన్స్ మంగళవారం వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ. 3,995 కోట్ల రూపాయల లాభం నమోదైనట్టు బజాజ్ ఫైనాన్స్ పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి నికర వడ్డీ ఆదాయం 42 శాతం పెరిగి రూ .16,913 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ఆదాయం రూ. 6,302 కోట్లుగా ఉండగా, గత ఏడాది ఇదే కాలంలో రూ .5,307.66 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ 38 శాతం పెరిగి రూ .4,684 కోట్లకు చేరింది. ఇతర ఆదాయాలు రూ. 642 కోట్ల నుంచి రూ. 929 కోట్లతో 45 శాతం వృద్ధి చెందాయి. 2020 మార్చి 31 నాటికి స్థూల ఎన్‌పీఏ 1.61 శాతం ఉండగా, నికర ఎన్‌పీఏలు 0.65 శాతంగా ఉన్నాయి.