బజాజ్ ఆటో కార్యకలాపాల ఆదాయం రూ. 7,156 కోట్లు!

by Harish |
బజాజ్ ఆటో కార్యకలాపాల ఆదాయం రూ. 7,156 కోట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో నికర లాభం 19 శాతం క్షీణించి రూ. 1,138 కోట్లుగా నమోదైనట్టు వెల్లడించింది. తక్కువ వడ్డీ రేట్ల కారణంగానే కంపెనీ ఆదాయం తగ్గిందని కంపెనీ పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 1,402.42 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల మొత్తం ఆదాయం రూ. 7,156 కోట్లుగా ఉందని, గతేడాది ఇదే కాలంలో రూ. 7,707 కోట్లతో పోలిస్తే 7 శాతం క్షీణించినట్టు కంపెనీ ప్రకటించింది. ఎబిటాకు ముందు సంస్థ ఆదాయలు రూ. 1,300 కోట్లు ఉండగా, గతేడాది కాలంలో ఇది రూ. 1,305 కోట్లని, ఎబిటా మార్జిన్ 16.9 శాతం నుంచి 18.2 శాతానికి పెరిగిందని కంపెనీ తెలిపింది.

సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ లాభం 1 శాతం తగ్గి రూ. 1,233 కోట్లకు చేరింది. ఇక, జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ విక్రయాలు గతేడాది నమోదైన 11.73 లక్షల యూనిట్లతో పోలిస్తే 10 శాతం క్షీణించి 10.53 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. దేశీయ అమ్మకాలు 9 శాతం క్షీణించి 5.73 లక్షల యూనిట్లకు చేరుకోగా, ఎగుమతులు 12 శాతం తగ్గి 4.79 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి.

‘దేశీయ ద్విచక్ర వాహనాలు ఈ త్రైమాసికంలో డిమాండ్ భారీగా పెరిగింది. పండుగ సీజన్ ఉండటంతో రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండో త్రైమాసికంలో మొత్తం పరిశ్రమ వృద్ధ్ 7 శాతం పెరిగిందని’ బజాజ్ ఆటో ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఆర్థిక ఫలితాలు ఉండటంతో బజాజ్ ఆటో షేర్లు గురువారం 0.05 శాతం తగ్గి రూ. 3,014.75 వద్ద ట్రేడయింది.

Advertisement

Next Story

Most Viewed