- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజకీయాల్లోకి బహుజన నేత.. ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం
దిశ, కరీంనగర్ సిటీ: పోరాటాలే ఊపిరిగా.. విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, పదిహేను సంవత్సరాల పాటు అలుపెరుగని పోరు నడిపి, ఉద్యమశక్తిగా పేరు తెచ్చుకున్న బహుజన విద్యార్థి నేత కొంకటి శేఖర్ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. బడుగు, బహుజన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా దివంగత కాన్షీరాం స్థాపించిన బహుజన సమాజ్ పార్టీతో రాజకీయ రంగప్రవేశం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. తన స్వేరో గురువు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బీఎస్పీ తీర్థం పుచ్చుకోనున్నాడు. హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వందలాది మంది అనుచరులతో తరలివెల్లి సోమవారం నీలి కండువా కప్పుకొనున్నారు. 2007లో మొదటి సారిగా MSF నాయకునిగా మొదలైన ప్రస్థానం 2018లో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించిన ఫిట్ ఇండియా సంస్థ రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపికయ్యాడు.
విద్యార్థి నాయకుడిగా, బాధ్యత గల యువకుడిగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మమేకమై, తన వంతుగా అనేక ఆందోళనలు, పోరాటాల్లో ముందుండి నడిపించాడు. యువతను చైతన్య పర్చి తనకంటూ ప్రత్యేకత ఏర్పరచుకున్నాడు. గురువు RSP ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని, రక్తదాన శిబిరాలు, ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో మారథాం రన్ వంటి కార్యక్రమాలు చేపట్టారు. శేఖర్ చేరికతో జిల్లాలో బీఎస్పీ బలోపేతం కావడమే కాకుండా, అతని ప్రభావం యువతపై ఇతర పార్టీలపై పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.