- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
100 మిలియన్ వ్యూస్‌తో ‘బాహ కిలిక్కి’ రికార్డ్
దిశ, వెబ్‌డెస్క్ :
ఎంతోమంది గాయనీగాయకులను తెలుగు చిత్రసీమకు అందించిన ప్రోగ్రామ్ ‘పాడుతా తీయగా’. 1997లో ఆ కార్యక్రమం ద్వారానే వెలుగులోకి వచ్చిన గాయని ‘స్మిత’. సినిమా పాటల కన్నా పాప్ గాయనిగా తన మ్యూజిక్ ఆల్బమ్స్‌తోనే స్మిత ఎక్కువ పాపులారిటీ సంపాదించింది. మొదట ‘హాయ్ రబ్బా’తో తన మ్యూజిక్ ఆల్బమ్స్ ప్రస్థానం మొదలెట్టిన స్మిత.. ‘మసక మసక’, ‘సన్నజాజి’ వంటి ఆల్బమ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత బాహుబలి టీమ్‌కు ట్రిబ్యూట్‌గా ‘బాహ కిలిక్కి’ పాటతో మళ్లీ కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఈ పాట ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. కాగా, ఈ పాట తాజాగా మరో ఫీట్ సాధించడం విశేషం.
బాహుబలిలో నటించిన ప్రభాకర్‌తో కలిసి బాహుబలి ఫేమస్ లాంగ్వేజ్ ‘కిలికిలి’ భాష ఆధారంగా రూపొందించిన వీడియో సాంగ్.. తాజాగా 100 మిలియన్ల వ్యూస్ సాధించింది. సినీ చరిత్రలో ఓ రీజనల్ సాంగ్.. ఇంత అత్యధిక సంఖ్యలో వ్యూస్ పొందడం ఇదే తొలిసారి కాగా, ఈ పాట ఇంత గొప్ప అచీవ్‌మెంట్ సాధించడంతో.. స్మిత ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకుంది.
‘100 మిలియన్ అండ్ కౌంటింగ్. నా యూట్యూబ్ అకౌంట్‌లో ‘బాహ కిలిక్కి’ 100 మిలియన్‌కు రీచ్ అయిన సందర్భంగా సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. కృతజ్ఞతలు..’ అని స్మిత ట్విట్ చేయడమే కాకుండా ఆ సాంగ్‌కు సంబంధించిన రెండు ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ పాటలో భాగమైన మదన్ కర్కి, బాస్కో మార్టిస్, అచ్చురాజమణిలకు ధన్యవాదాలు తెలిపింది. స్మిత తన సంగీతం ప్రస్థానం మొదలుపెట్టి ఇటీవలే 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. తన తొలి ఆల్బమ్ ‘హాయ్ రబ్బా’ 2000లో విడుదలైంది.
https://twitter.com/smitapop/status/1304354036208951297