1917 కి బ్రిటిష్ సినిమా అవార్డుల పట్టాభిషేకం

by Jakkula Samataha |
1917 కి బ్రిటిష్ సినిమా అవార్డుల పట్టాభిషేకం
X

మొదటి ప్రపంచయుద్ధ నేపథ్యంలో వచ్చిన 1917కి బ్రిటిష్ సినిమా అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడుతో పాటు వివిధ కేటగిరీల్లో ఏకంగా ఏడు బాఫ్తా అవార్డులను ఈ సినిమా సొంత చేసుకుంది. ఆసక్తికర కథనంతో సాగే ఈ సినిమాకు అవుట్‌స్టాండింగ్ బ్రిటిష్ ఫిల్మ్, సౌండ్, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ, స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులు దక్కాయి.

జోకర్ సినిమాకు గాను జాక్విన్ ఫీనిక్స్‌కి ఉత్తమ నటుడి అవార్డు, జూడీ సినిమాకు గాను రెనీ జెల్వేగర్‌కి ఉత్తమ నటి అవార్డు వరించాయి. పది కేటగిరీల్లో నామినేట్ అయిన నెట్‌ఫ్లిక్స్ వారి ది ఐరిష్‌మ్యాన్ సినిమా ఒక్క అవార్డు కూడా గెలుచుకోలేకపోయింది. ఇక ఉత్తమ సహనటిగా లారా డెన్, సహనటుడిగా బ్రాడ్‌పిట్ అవార్డులు అందుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed