సీఎం వైఎస్ జగన్‌తో బ‌ద్వేలు ఎమ్మెల్యే డా.సుధ‌ భేటీ

by srinivas |
సీఎం వైఎస్ జగన్‌తో బ‌ద్వేలు ఎమ్మెల్యే డా.సుధ‌ భేటీ
X

దిశ, ఏపీ బ్యూరో: బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో అత్యధిక మెజార్టీతో విజ‌యం సాధించిన ఎమ్మెల్యే డా.దాసరి సుధను ముఖ్యమంత్రి వైయస్ జగన్ అభినందించారు. భారీ మెజారిటీ సాధించడం పట్ల సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ను ఎమ్మెల్యే దాస‌రి సుధ‌, కడప ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డిలు మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిశారు. ఇకపోతే బద్వేలు ఉపఎన్నికల్లో డాక్టర్ దాసరి సుధ 90,553 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సాధించిన 90,111మెజారిటీని డా.దాసరి సుధ బ్రేక్ చేసి చరిత్ర సృష్టించారు.

Advertisement

Next Story