- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్వారంటైన్ పదం వెనక పెద్ద కథ!
దిశ, వెబ్‌డెస్క్:
కరోనా వైరస్ తాకిడితో సెల్ఫ్ ఐసోలేషన్, సోషల్ డిస్టన్స్, క్వారంటైన్ అనే పదాలు విరివిగా ఉపయోగంలోకి వచ్చాయి. అయితే వీటిలో క్వారంటైన్ పదం వెనక చాలా పెద్ద కథే ఉంది. మొదటిసారిగా ఈ పదాన్ని 14వ శతాబ్దంలో ఉపయోగించారు. క్వారంటైన్ అనే పదం లాటిన్ భాషలోని క్వాడ్రాజింటా, ఇటాలియన్ భాషలోని క్వారంతా పదాల నుంచి పుట్టింది. ఈ రెండు పదాలకు అర్థం 40 (నలభై).
ఫిలడెల్ఫియాలో 1793లో ఎల్లో ఫీవర్ వచ్చినపుడు నావికులను నగరం బయట క్వారంటైన్ చేశారు. అలాగే 1892 న్యూయార్క్ టైఫస్ వచ్చినపుడు 70 మందిని, 2003లో సార్స్ సమయంలో కెనడాలో 30 వేల మందిని క్వారంటైన్ చేశారు. కానీ క్వారంటైన్ చేయడం అనేది 14వ శతాబ్ధం మధ్య కాలం నుంచే అమల్లో ఉంది.
1343లో యూరప్ ఖండంలో బ్లాక్ డెత్ అని పిలిచే ప్లేగు వ్యాధి ప్రబలింది. 1347-50 వరకు మూడేళ్ల వరకు వారంతా కష్టకాలంలో గడిపారు. దీంతో అప్పటి వెనిస్ ప్రభుత్వం రగుసా నగరంలో ప్లేగు ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే పడవల మీద నిషేధం విధించారు. 30 రోజులపాటు పడవల్లో వచ్చిన వారిని కలవకుండా ఉండాలి. దీన్ని ట్రెంటినో అన్నారు. ట్రెంటినో అంటే ముప్ఫై అని అర్థం. ఈ నిషేధం తర్వాత కొంత ఉపశమనం కనిపించడంతో, యూరప్ ఖండంలోని మిగతా దేశాలు కూడా ఈ నిషేధాన్ని అమలు చేశారు. కాకపోతే వారందరూ 30 రోజుల నుంచి 40 రోజుల వరకు నిషేధాన్ని పొడిగించారు. అయితే ఈ పెంపు ఎందుకు అనే విషయం గురించి స్పష్టత లేదు. అప్పటి నుంచి 40ని ఇటాలియన్‌లో క్వారంతా అనడంతో ఈ పదం పాపులర్ అయ్యి, క్వారంటైన్ అనే పదం ఇంగ్లిషులో చేరిపోయింది.
అయితే ఈ 40 రోజుల పెంపు గురించి కొందరు విశ్లేషకులు కొన్ని కథనాలను అల్లారు. ఇందుకోసం బైబిల్ రిఫరెన్సులను వాడుకున్నారు. ఎడారిలో జీసెస్ గడిపిన కాలమని కొందరు, సినాయ్ పర్వతం వద్ద మోసెస్ గడిపిన కాలం అని వివరణలు ఇచ్చుకున్నారు.
Tags: Italian, Quarantine, Trentino, Moses, Jesus, 40, Corona, COVID 19