మిస్టరీ : తోకతో జన్మించిన బాలుడు.. షాక్‌లో వైద్యులు

by Anukaran |   ( Updated:2021-11-06 20:31:18.0  )
మిస్టరీ : తోకతో జన్మించిన బాలుడు.. షాక్‌లో వైద్యులు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓ శిశువు వైద్యులను ఆశ్చర్యపరిచేలా జన్మించాడు. తాము చూసింది నిజమేనా అని ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా.?. ఓ తోకతో జన్మించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వింత ఘటన బ్రెజిల్ దేశంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఫోర్టలెజా పట్టణానికి చెందిన 35 వారాల గర్భిణి పురుటినొప్పులతో ఆల్బెర్ట్‌ సాబిన్‌ అనే పిల్లల ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రిలో ఆమె పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది.

అయితే ఆ బాలుడికి తోక ఉండటం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. 12 సెంటీమీటర్లు ఉన్న ఆ తోక చివర్లో 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో బంతి లాంటి ఆకారం కూడా ఉంది. అయితే, ఆ తోక చర్మానికి మాత్రమే పెరిగిందని, నాడీ వ్యవస్థకు తోకతో ఎలాంటి అనుసంధానం లేదని వైద్యులు గుర్తించారు. దీంతో శస్త్రచికిత్స ద్వారా ఆ తోకను తొలగించినట్లు వైద్యులు వెల్లడించారు. విషయం ఏంటంటీ తల్లికి 9 నెలలుగా వైద్య సేవలు అందిస్తున్న సమయంలో వారికి తోక కనిపించలేదని పేర్కొన్నారు. అయితే డాక్టర్లు మాత్రం ఈ తోకను నిజమైన ‘మానవ తోక’ అని పిలుస్తున్నారు.

Advertisement

Next Story