కరోనా కాలంలో పుట్టిన పిల్లలు ఇలాగే ఉంటారట.. వీడియో వైరల్

by Anukaran |   ( Updated:2021-07-17 06:43:15.0  )
corona children
X

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది నుంచి కరోనా ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక ఈ మహమ్మారి వలన శానిటైజర్, మాస్క్ మన జీవితాల్లో ఒక భాగంగా మారిపోయాయి. పెద్దలు పాటించడంతో పాటు పిల్లలకు కూడా నేర్పించడం అలవాటుగా మారిపోయింది. దీంతో చిన్నారులు సైతం శానిటైజ్ చేసుకుంటూ, మాస్క్ లతో కనిపిస్తున్నారు. అయితే.. మరి కరోనా కాలంలో పుట్టిన చిన్నారులు ఎలా ఉంటారు.. పాపం వారికి పుట్టినప్పటి దగ్గరనుంచి మాస్క్ లు పెట్టుకోవడం, చేతులకు శానిటైజ్ రాసుకోవడమే అలవాటుగా మారిపోయింది. ప్రస్తుతం షాపింగ్‌ మాల్స్‌, ఆఫీసులు, ఆస్పత్రులు ఇలా ప్రతి చోటా శానిటైజర్‌ స్టాండ్‌లు కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్లాలంటే తప్పకుండా శానిటైజర్‌తో చేతులు కడుక్కోవాల్సిందే. దీంతో ఆ చిన్నారుల పై కరోనా ప్రభావం ఎంతలా పడిందో ఈ వీడియో లో తెలుస్తోంది.

https://www.instagram.com/p/CQ_K-Fpn-o_/

ఈ వీడియోలో ఒక చిన్నారి ఎక్కడికి వెళ్లినా శానిటైజర్ రాసుకొంటుంది. శానిటైజర్ రాసుకోవడం మంచిదే కదా అనుకోవచ్చు. కానీ, ఆ చిన్నారి ఏ స్టాండ్ చూసినా శానిటైజర్ స్టాండ్ అనుకొంటుంది. కనిపించిన లాంప్‌ పోస్ట్‌, ఎలక్ట్రికల్‌ సర్క్యూట్స్‌, లాన్‌లో ఉన్న లైట్‌ స్టాండ్‌, చివరకు గార్డెన్‌లో ఉన్న చిన్న గోడ వద్దకు కూడా వెళ్లి, వాటిని తడిమి.. చేతిలో శానిటైజర్‌ పడినట్లు భావిస్తుంది. ఆ తర్వాత చేతులను రుద్దుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. బేబి గ్రామ్ అనే అకౌంట్ లో పోస్ట్ అయిన ఈ వీడియోను 1.8మిలియన్ల మంది చూశారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎంత ముద్దుగా ఉందో చిన్నారి అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తుంటే.. మరికొంతమంది మా చిన్నారులు కూడా ఇలాగే చేస్తున్నారు అంటూ చెప్పుకోస్తున్నారు. ఎంతైనా కరోనా సమయంలో పుట్టిన పిల్లలు ఇలాగే ఉంటారు మరి..

Advertisement

Next Story

Most Viewed