- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాబు ద్రోహి.. బాలయ్యపై నమ్మకమే నిలిపింది: బాబూరావు
నమ్మక ద్రోహం చేయడంలో చంద్రబాబు దిట్ట అని వైఎస్సార్సీపీలో చేరిన కదిరి బాబూరావు తెలిపారు. నందమూరి బాలకృష్ణపై ఉన్న అభిమానమే తనను ఇన్నాళ్లూ టీడీపీలో కొనసాగేలా చేసిందని ఆయన అన్నారు. 2014లోనే వైఎస్సార్సీపీలో చేరాలని పిలుపు వచ్చినప్పటికీ.. తనకు బాలకృష్ణతో ఉన్న అనుబంధం కారణంగానే టీడీపీలో కొనసాగానని చెప్పారు. టీడీపీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో ఉన్నానని, తొలి ఓటు టీడీపీకే వేశానని ఆయన చెప్పారు.
2014లో టీడీపీ తరఫున కనిగిరి నియోజకవర్గం నుంచి పన్నెండు వేల మెజార్టీతో గెలిచానని, ఆ నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానని అన్నారు. అలాంటిది, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బాబు తనను దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయించారని, కనిగిరి నుంచే పోటీ చేస్తానని చెప్పినా తన మాటలు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని పత్రికల అధిపతులతో తనకు ‘ఆబ్లిగేషన్స్’ ఉన్నాయని చెప్పిన చంద్రబాబు తనను దర్శి నుంచే పోటీ చేయించారని విమర్శించారు.
ఒకవేళ దర్శి నుంచి తాను ఓడిపోతే తనకు ఎమ్మెల్సీ పదవో, లేకపోతే, కనిగిరి టీడీపీ ఇన్ చార్జి పోస్టో ఇస్తానని నాడు చంద్రబాబు చెప్పారని, ఈ విషయమై అడిగిన ప్రతిసారీ బాబు మాట దాటవేసేవారని ఆయన విమర్శించారు. దీనిపై బాలకృష్ణ చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. చంద్రబాబును నమ్మలేకే బాలయ్యను వదిలి వెళ్లాల్సి వస్తోందని ఆయన చెప్పారు. బాలకృష్ణ చాలా మంచి వ్యక్తి అని, ఎన్టీఆర్, బాలకృష్ణలు చంద్రబాబు లాంటి వాళ్లు కాదని ‘హండ్రెడ్ పర్సంట్‘ చెప్పగలనని ఆయన తెలిపారు. ఎన్టీఆర్, బాలకృష్ణలు దేవుడి లాంటి వ్యక్తులను కొనియాడారు. బాలకృష్ణ అమాయకుడని, ఆయన్ని ఏవిధంగా చంద్రబాబు మోసం చేస్తారో? అని ఆందోళన వ్యక్తం చేశారు.