- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘హుజురాబాద్‌లో విన్నర్ అతడే అంటోన్న మాజీ మంత్రి’
దిశ, అందోల్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో సర్వేలన్నీ ఈటల గెలుపు ఖాయమని చూపిస్తున్నాయని మాజీ మంత్రి, సినీ నటుడు బాబు మోహన్ అన్నారు. సోమవారం అందోల్, టేక్మాల్ మండలాల్లోని పలు గ్రామాల్లో కొవిడ్ బారీన పడి మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఆ భయంతోనే దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నారని.. ఏడేండ్లుగా లేనిది కొత్తగా ఎందుకో అంటూ ప్రశ్నించారు.
కేవలం హుజురాబాద్ నియోజకవర్గంలో గెలుపు కోసమే అనేక పథకాలను ఆ నియోజకవర్గంలో అమలు చేస్తున్నారని.. ఇవే పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేయడం లేదని బాబు మోహన్ విమర్శించారు. దళితులకు మూడేకరాలు ఇవ్వలేని కేసీఆర్.. ప్రభుత్వ భూములను ప్రయివేట్ వ్యక్తులకు ఎందుకు అమ్ముతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది కప్పిపుచ్చుకోవడానికి దళిత బంధు స్కీమ్‌తో మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్‌కు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని బాబు మోహన్ హెచ్చరించారు.