సుప్రీంకోర్టు ఆదేశం.. ఎట్టకేలకు తెరుచుకున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు (వీడియో)

by Aamani |   ( Updated:2023-05-20 15:32:02.0  )
babli project gates open
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: గోదావరి నదిపై ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ మూడు గేట్లను జల సంఘం అధికారులు ఎత్తివేశారు. గురువారం ఉదయం రెండు రాష్ట్రాల అధికారుల సమక్షంలో మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తంగా 14 గేట్లను ఎత్తివేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాల మేరకు బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు 4 నెలల పాటు ఎత్తి ఉంచి అక్టోబర్ 29 న మూయనున్నారు.బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకోవడంతో శ్రీరాంసాగర్ కి గోదావరి జలాలు చేరనున్నాయి. వీటితో పాటు ఈ సీజన్ లో వర్షాలు ఎక్కువగా పడితే ఈసారి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీరాంసాగర్ ఎగువ పరివాహక ప్రాంతాల మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ లో గురువారం ఉదయం వరకు 90 టీఎంసీ లకు గాను 27 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఉదయం 4వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed