- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటల ఆత్మగౌరవం గురించి మాట్లాడటం విడ్డూరం: వినోద్ కుమార్
దిశ, జమ్మికుంట: ప్రభుత్వ శాఖలను ప్రయివేట్ పరం చేస్తున్న బీజేపీలో ఈటల రాజేందర్ చేరి ఆత్మ గౌరవం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సోమవారం జమ్మికుంట మండలంలోని శాయంపేట, నాగంపేట, బిజిగిరి షరీఫ్, గండ్రపల్లి, తనుగుల, వెంకటేశ్వరపల్లి, సైదాబాద్ గ్రామాల్లో ఎమ్మెల్యే అరూరి రమేష్, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారో అర్థం కాలేదన్నారు. అన్ని నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం మంజూరు చేస్తే చాలాచోట్ల పనులు పూర్తయ్యాయని, మంత్రిగా ఉన్న రాజేందర్ ఎందుకు మొదలుపెట్టలేదో ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. మేము కూడా రాజీనామా చేసినం కానీ, అప్పుడు తెలంగాణ సాధన కోసం రాజీనామా చేస్తే ప్రజలు బ్రహ్మారథం పట్టారని గుర్తు చేశారు. కేవలం ఆస్తులను కాపాడుకోవడం కోస బీజేపీలో చేరిన ఈటలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల రాష్ట్ర చైర్మన్ వాసుదేవరెడ్డి, క్లస్టర్ ఇన్‌చార్జీ భరత్ కుమార్ రెడ్డి, జడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు లింగారావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.