- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా బాధితులకు ‘అయ్యప్ప’ ల ఆర్థికసాయం
దిశ, పటాన్ చెరు: కరోనా బాధితులను అయ్యప్ప భక్తులు ఆదుకున్నారు. కష్టకాలంలో ఆర్థిక చేయూతనిచ్చి మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. పటాన్ చెరు పట్టణంలోని రాజు గురుస్వామి ఇంట్లో అద్దెకున్న దంపతులకు కరోనా సోకింది. వారి చికిత్స నిమిత్తం పటాన్ చెరు శబరిమల అయ్యప్ప సేవా సమాజం నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు రూ.20 వేలు చెక్కు, ఫలాలు అందజేశారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు (కాజు గురుస్వామి) మాట్లాడుతూ ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో తమకు తోచిన విధంగా సహాయం అందజేశామని తెలిపారు. నిరుపేదలకు అయ్యప్ప సేవా సమితి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా కరోనా బాధితులను ఆదుకుంటున్న పటాన్ చెరు శబరిమల అయ్యప్ప సేవా సమాజంను పలువురు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సాస్ అధ్యక్షులు బల్వంత్ గురు స్వామి, జనరల్ సెక్రెటరీ కాజుపల్లి నవీన్ ముదిరాజ్ గురు స్వామి, ట్రెజరర్ నామ నరసింహులు (రాజు)గురు స్వామి, సెక్రటరీ శ్రీనివాస్ చారి గురు స్వామి, ఆర్గనైజేషన్ సెక్రటరీ నరసింహ చారి స్వామి పాల్గొన్నారు.