- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్వామియే శరణం అంటూ మార్మోగిన మాదన్నపేట చెరువుకట్ట
దిశ, నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలోని ధర్మ శాస్త్ర అయ్యప్ప ఆలయ పాలకవర్గం ఆధ్వర్యంలో జరిగిన పంభారాట్ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. డివిజన్ లోని అన్ని మండలాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతులు మహన్నదాతగా వ్యవహరించారు. సుమారు 10 వేల మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పాలకవర్గం స్వామివారిని పట్టణ కేంద్రంలోని రహదారులపై డప్పు వాయిద్యాల నడుమ ఊరేగించి, కోలాటాల నడుమ ఆడిపాడుతూ స్వామిని రథంపై శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం మాదన్నపేట చెరువులో స్వామివారికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరై పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు వీక్షించి స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వామిని శరణు కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ఫనిందర్, జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మున్సిపాలిటీ చైర్ పర్సన్ గుంటి రజని కిషన్, మాజీ చైర్మన్ నాగెల్లి వెంకట నారాయణ గౌడ్, రాయిడి రవీందర్ రెడ్డి, ముణిగాల వెంకట్ రెడ్డి, వెల్పుగొండ రాజు, జక్క అశోక్ యాదవ్, వివిధ మండలాల పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.