ముందు పార్టీ పేరు తెలుసుకో: అయ్యన్న పాత్రుడు

by srinivas |
ముందు పార్టీ పేరు తెలుసుకో: అయ్యన్న పాత్రుడు
X

దిశ ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లక్ష్యంగా టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ మాధ్యమంగా తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ప్రాంతీయ పార్టీ ”యుశ్రారైకాపా”కి జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన సాయి రెడ్డి ముందు మీరు మీ పార్టీ పేరు తెలుసుకునే పనిలో ఉండండి. మీ గన్నేరుపప్పు అజ్ఞానం వలన ఎంపీ పార్టీకి షోకాజ్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకున్నారు. దొంగ లెక్కలు రాయడం ఆపి ఇద్దరు కలిసి ఎంపీ రాసిన లేఖకు సమాధానాలు రాయడం మొదలుపెట్టండి. ఫైబర్ గ్రిడ్ లాంటి విషయాల గురించి తీరిగ్గా ఆలోచిందురు. ప్రస్తుతానికి మజ్జిగ, నెయ్యిపై ఎలాగో సీబీఐ ఉందిగా’’ అంటూ ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story