విదేశాల్లోనూ రామజపమే: అమెరికా, ఆస్ట్రేలియాలో మొదలైన సంబురాలు

by samatah |   ( Updated:2024-01-22 05:10:53.0  )
విదేశాల్లోనూ రామజపమే: అమెరికా, ఆస్ట్రేలియాలో మొదలైన సంబురాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్టకు సమయం దగ్గర పడుతుండటంతో విదేశాల్లోని ప్రవాస భారతీయులు సంబురాలు నిర్వహిస్తున్నారు. అమెరికా, ఇతర దేశాల్లోని భారతీయులు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. న్యూయార్క్‌లోని ఇండియన్స్ టైమ్స్ స్క్వేర్‌ను పెద్ద రాముడి చిత్రాలతో వెలిగించారు. అంతేగాక యూఎస్ అంతటా దాదాపు 12 కార్యక్రమాలు ప్లాన్ చేసినట్టు విశ్వహిందూ పరిషత్ అమెరికన్ శాఖ తెలిపింది. యూఎస్‌లో అంతటా ఉన్న హిందువులతో కలిసి10 రాష్ట్రాల్లో 40కి పైగా బిల్‌బోర్డ్‌లను ఏర్పాటు చేసింది. మారిషస్‌లో ప్రవాస భారతీయులు దేవాలయాల వద్ద దీపాలు వెలిగించి రామాయణ పథం పఠించనున్నారు. బ్రిటన్‌లోని ప్రవాస భారతీయులు లండన్‌లో కారు ర్యాలీని చేపట్టి జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. ఇక, అస్ట్రేలియాలోనూ వందలాది దేవాలయాల్లో కార్యక్రమాలను చేపడుతున్నారు. అలాగే సీతాదేవీ జన్మస్థలంగా భావించే జనక్ పూర్ధామ్‌లోనూ భక్తుల కోలాహలం నెలకొంది.

Advertisement

Next Story