అయోధ్య చరిత్రకు సాక్షిగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉంది: మహేష్ బాబు

by Mahesh |   ( Updated:2024-01-25 04:26:19.0  )
అయోధ్య చరిత్రకు సాక్షిగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉంది: మహేష్ బాబు
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో ఈ రోజు మధ్యహ్నం 12: 29 నిమిషాలకు ప్రధాని మోడీ చేతుల మీదుగా శ్రీరాముడి బాల విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు హాజరయ్యారు. అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట పై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ప్రస్తుతం విదేశి పర్యటనలో ఉన్న మహేష్.. ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన ట్వీట్‌లో చరిత్ర యొక్క ప్రతిధ్వనులు, విశ్వాసం యొక్క పవిత్రత మధ్య, అయోధ్యలో రామ మందిరాన్ని గొప్పగా ప్రారంభించడం ఐక్యత, ఆధ్యాత్మికతకు శాశ్వతమైన చిహ్నాన్ని తెలియజేస్తుంది. ఇటువంటి చరిత్రకు సాక్షిగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉంది. అని మహేష్ బాబు తన ట్వీట్ లో రాసుకొచ్చాడు.

Advertisement

Next Story