రామమందిర ప్రతిష్ఠ కార్యక్రమం లైవ్ పై తమిళనాడులో నిషేధం..!

by Shamantha N |   ( Updated:2024-01-21 14:46:08.0  )
రామమందిర ప్రతిష్ఠ కార్యక్రమం లైవ్ పై తమిళనాడులో నిషేధం..!
X

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్య రామమందిర ప్రతిష్ఠ అంగరంగవైభవంగ జరగనుంది. ఇందులో భాగంగానే.. రాముడి ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేశారు. కాగా.. ఈ ప్రసారాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని తెలిపారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. స్థానిక మీడియా ప్రచురించిన ఆర్టికల్ ను షేర్ చేస్తూ.. రామమందిర కార్యక్రమాలను స్టాలిన్ ప్రభుత్వం బ్యాన్ చేసిందన్నారు.

తమిళనాడులో 200కి పైగా రామాలయాలు ఉన్నాయన్నారు. హెచ్‌ఆర్‌ అండ్ సీఈ ఆధ్వర్యంలో.. ఈనెల 22న రాముడి పేరిట పూజలు, భజనలు, ప్రసాదాలు, అన్నదానం వంటి కార్యక్రమాలకు కూడా అక్కడ అనుమతి లేదన్నారు. ప్రైవేటు ఆలయాల్లో నిర్వహించిన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకుని.. మండపాలు కూల్చివేస్తామని నిర్వహకులను బెదిరిస్తున్నారన్నారు. ఇలాంటి హిందూ- వ్యతిరేక వైఖరిని, హిందువులపై ద్వేషాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాని నిర్మలా సీతారామని ట్వీట్ చేశారు. లోకల్ మీడియా పబ్లిష్ చేసిన ఆర్టికల్ ని ఈ ట్వీట్ కి జత చేశారు. డీఎంకే ఇండియా కూటమిలో భాగమని.. అందుకే ఇలా హిందూ వ్యతిరేక ప్రయత్నం చేస్తున్నారన్నారు.

నిర్మలా సీతారామన్ చేసిన ఆరోపణలను ఖండించింది తమిళనాడు ప్రభుత్వం. హెచ్ఆర్ అండ్ సీఈ మంత్రి పీకే శేఖర్ నిర్మలా సీతారామన్ పై మండిపడ్డారు. ఉన్నత స్థానంలో ఉండి ఇలా ఫేక్ న్యూస్ ని వ్యాప్తి చేయడం దారుణం అన్నారు. రాముడి పేరిట పూజలు, ప్రసాదాల పంపిణీపై ఎలాంటి నిషేధం విధించలేదన్నారు. కావాలనే పుకార్లను ప్రచారం చేస్తున్నారన్నారు శేఖర్ బాబు.

Advertisement

Next Story

Most Viewed