- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రామమందిర వేడుకలో కాంగ్రెస్ మంత్రి, మాజీ సీఎం కొడుకు.. ఎవరు ?
దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించినా.. ఆయన మాత్రం స్వీకరించారు. సోమవారం జరిగిన శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంతకీ ఆ నేత ఎవరు అంటే.. విక్రమాదిత్య సింగ్ !! ఈయన హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుత హిమాచల్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ కుమారుడే ఈ విక్రమాదిత్య సింగ్. అయోధ్య ఉత్సవంలో పాల్గొనేందుకు ఆయన ఆదివారమే చండీగఢ్ నుంచి లక్నోకు చేరుకున్నారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ ప్రజాపనుల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న విక్రమాదిత్య సింగ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు రాష్ట్ర అతిథిగా ప్రకటించింది. ‘‘ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం. దేవతలపై విశ్వాసం ఉన్న హిందువుగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం, రాముడి ప్రాణ ప్రతిష్ఠను చూడటం నా బాధ్యత’’ అని విక్రమాదిత్య సింగ్ స్పష్టం చేశారు.
ఎవరీ విక్రమాదిత్య సింగ్ ?
1989లో జన్మించిన విక్రమాదిత్య సింగ్.. మాజీ సీఎం దివంగత వీరభద్ర సింగ్ కుమారుడు. విక్రమాదిత్య తల్లి ప్రతిభా సింగ్ ప్రస్తుతం మండి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. ఆమె రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కూడా. మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు విక్రమాదిత్య పూర్వీకులు హిమాచల్ ప్రదేశ్‌లోని బుషహర్ అనే ప్రాంతానికి రాజులుగా ఉండేవారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి హిస్టరీ సబ్జెక్టులో ఈయన పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. విక్రమాదిత్య సింగ్ 2013 నుంచి 2017 మధ్య కాలంలో హిమాచల్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ చీఫ్‌గా వ్యవహరించారు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా నిలిచారు. 2017లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు., 2023లో మరోసారి సిమ్లా రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయఢంకా మోగించారు. కాగా, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ శర్మ కూడా అయోధ్య రామమందిర కార్యక్రమానికి హాజరయ్యారు.