- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోద్య ఆలయం పేల్చేస్తా.. దావూద్ ఇబ్రహీం అనుచరుడి పేరుతో బెదిరింపు కాల్
దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్య రామాలయ ప్రతిష్ఠ కోసం సర్వం సిద్ధమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి టైంలో బిహార్ పోలీసులకు బెదిరంపు కాల్ వచ్చింది. దావూద్ ఇబ్రహీం అనుచరుడినని.. అయోధ్య మందిరాన్ని కూల్చివేస్తానని హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అరారియా జిల్లా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అరారియా జిల్లాకు చెందిన 21 ఏళ్ల ఇంతేఖాబ్ ఆలమ్ గా నిందితుడ్ని గుర్తించారు. పలాసి పోలీస్ స్టేషన్ పరిధిలోని బలువా కలియగంజ్ లోని అతడి ఇంటినుంచే ఆలమ్ ను అరెస్టు చేశారు. అయోధ్య మందిరాన్ని పేల్చేస్తానని.. తనపేరు చోటా షకీల్ అని తెలిపినట్లు చెప్పారు అరారియా ఎస్పీ. నిందితుడికి ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని.. కానీ అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తెలిపారు. సున్నితమైన సమస్య కావడంతో.. నిందితుడిపై కేసు నమోదు చేసి.. అతడి మొబైల్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
మరోవైపు ఈనెల 22న అంగరంగవైభవంగా ప్రధాని మోడీ చేతుల మీదిగా రామాలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ వేడుకకు 7 వేలమందికి పైగా ప్రముఖులు హాజరుకానున్నారు. వారణాసికి చెందిన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో ప్రాణప్రతిష్ఠ కోసం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి.