- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోధ్యకు హాజరయ్యే పూర్తి అతిథుల లిస్ట్ ఇదే!(వీడియో)
దిశ, ఫీచర్స్: అయోధ్యలో రాముడు కొలువుదీరేందుకు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. ఈ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించి అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే ప్రారంభోత్సవం రోజున ఆలయ ట్రస్ట్ ఆహ్వానించిన సెలబ్రిటీలు మాత్రమే అయోధ్యకు చేరుకోనున్నారు.ఈ సందర్భంగా మొత్తం 8 వేల మంది అతిథులు అయోధ్యకు రానుండగా, అందులో 506 మంది VIP లు ఉన్నట్లు ట్రస్ట్ వర్గాలు పేర్కొన్నాయి.అయోధ్యలో రేపు దివ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరుపుకోనుంది.ఈ అపూర్వ ఘట్టానికి హాజరు కావాలని దేశ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే ఆహ్వానాలు అందించింది.
ఈ నేపథ్యంలోనే మొత్తం 8 వేల మంది సెలబ్రిటీలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.ఈ అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కర్తగా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనుంది. వీరిలో 506 మందిని అత్యంత ప్రముఖులుగా ట్రస్ట్ ఎంపిక చేసింది. రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, క్రీడాకారులు,న్యాయ వ్యవస్థ లోని ప్రముఖులు, శాస్త్రవేత్తలు,సంగీత విద్వాంసులు, బిజినెస్‌మెన్‌లు ఈ జాబితాలో ఉన్నారు.ఇక రంగాల వారీగా కొందరు ప్రముఖుల పేర్లను చూసుకున్నట్లయితే..
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్, RSS చీఫ్ మోహన్ భగవత్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ ఉప ప్రధాని LK అద్వాణీ, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, యూపీ మాజీ CM కల్యాణ్‌సింగ్ కుటుంబం హాజరు కానుంది.
వీరితో పాటు మాజీ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, మాజీ ప్రధాని వాజ్‌పేయీ అల్లుడు రంజన్ భట్టాచార్య, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, మాజీ ఉప రాష్ట్రపతి M.వెంకయ్యనాయుడు, కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీ కుటుంబం, ప్రణాళికా సంఘం మాజీ ఛైర్‌పర్సన్ మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా,లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్,లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, AP మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, కర్ణాటక మాజీ CM HD కుమారస్వామి, మధ్యప్రదేశ్ మాజీ CM ఉమాభారతి ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
ఇక సినిమా ఇండస్ట్రీ నుండి అమితాబ్ బచ్చన్, రజనీకాంత్,మోహన్‌లాల్, అనుపమ్ ఖేర్,మాధురీ దీక్షిత్,చిరంజీవి,సంజయ్ లీలా బన్సాలీ,అక్షయ్ కుమార్,ధనుష్,రణ్‌దీప్ హుడా,రణ్‌బీర్ కపూర్, కంగనా రనౌత్,రిషబ్ శెట్టి, మధుర్ భండార్కర్, అజయ్ దేవగన్,జాకీ ష్రాఫ్,టైగర్ ష్రాఫ్,యశ్, ప్రభాస్,ఆయుష్మాన్ ఖుర్రానా,ఆలియా భట్, సన్నీ డియోల్,అల్లు అర్జున్, జూనియర్ ఎన్జీఆర్, రామ్ చరణ్, హేమమాలిని టీవీ రామాయణంలో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్,సీతగా నటించిన దీపికా చిఖ్లియాకు అయోధ్య ఆహ్వానం అందింది.
ఇక క్రీడా కారుల జాబితా చూసుకున్నట్లయితే,సచిన్ తెండూల్కర్, కపిల్‌దేవ్, మహేంద్ర సింగ్ ధోని, సునీల్ గావస్కర్, విరాట్ కోహ్లి, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్,అనిల్ కుంబ్లే,వీరేంద్ర సెహ్వాగ్, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, మిథాలీ రాజ్, విశ్వనాథన్ ఆనంద్, పి.టి.ఉష, ఫుట్‌బాలర్ బాయ్‌చుంగ్ భూటియా, సైనా నెహ్వాల్, పి.వి.సింధు, పుల్లెల గోపీచంద్, వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి ఉన్నారు. ఈ ఆహ్వానాన్ని తిరస్కరించిన రాజకీయ నాయకులు కూడా ఉన్నారు.
ఆహ్వానాన్ని తిరస్కరించిన రాజకీయ నేతలు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే,కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరీ, పలు ప్రతిపక్ష పార్టీల అధినేతలు, పలు రాష్ట్రాల సీఎంలు, ఇండియా కూటమి నేతలు ఈ ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఇందులో న్యాయమూర్తులు కూడా ఉన్నారు. CJI జస్టిస్ డీవై చంద్రచూడ్, మాజీ CJI జస్టిస్ రంజన్ గొగొయ్, మాజీ CJI జస్టిస్ ఎన్.వి.రమణ, అయోధ్య వివాదం తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తులు, పలువురు ప్రస్తుత మాజీ న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి,మాజీ దౌత్యవేత్తలు వీణా సీకరీ, లక్ష్మీ పురి,వందేభారత్ రైలు సూత్రధారి సుధాంశుమణి, జీ20 భారత ప్రభుత్వ ప్రతినిథి అమితాబ్ కాంత్ ఉన్నారు.
ఇక వ్యాపారవేత్తల విషయానికొస్తే.. ముకేశ్ అంబానీ కుటుంబం, గౌతమ్ అదానీ, రతన్ టాటా, ఎన్. చంద్రశేఖరన్ దంపతులు, మైనింగ్ మొగల్ అనిల్ అగర్వాల్, అశోక్ హిందూజ, అజీం ప్రేమ్‌జీ, బాంబే డైయింగ్ నుస్లీ వాడియా, సుధీర్ మెహతా, GMR రావు, స్థిరాస్తి వ్యాపారి నిరంజన్ హిరానందని, కుమారమంగళం బిర్లా దంపతులు, అజయ్ పిరమల్, ఆనంద్ మహీంద్రా, TCS కె. కీర్తివాసన్, నవీన్ జిందాల్, ఉదయ్ కోటక్, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతులు, నందన్ నీలేకని, టTV మోహన్‌దాస్ పాయ్‌ను ట్రస్ట్ ఆహ్వానించింది.
వీరితో పాటు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్, మాజీ ఛైర్మన్ కె. శివన్DRDO సుదర్శన్ శర్మ, ఇస్రో సంచాలకుడు నీలేశ్ దేశాయ్, మెట్రో ఇ.శ్రీధరన్, నీతి ఆయోగ్ సభ్యుడు VK సారస్వత్, సరోద్ విద్వాంసుడు హమ్జద్ అలీ ఖాన్, పాటల రచయిత మనోజ్ ముంతశిర్ దంపతులు, రచయిత ప్రసూన్ జోషి, గాయని శ్రేయా ఘోషల్, కైలాశ్‌ఖేర్, శంకర్ మహదేవన్, అనూప్ జలోటా, సోనూ నిగమ్, అనురాధా పౌఢ్వాల్ అయోధ్య రామ మందిరానికి అందించిన ఆహ్వానాల్లో ఉన్నారు.