అయోధ్యకు అందరికంటే ఎక్కువ విరాళం ఇచ్చింది ఇతడే!

by GSrikanth |   ( Updated:2024-01-23 03:10:11.0  )
అయోధ్యకు అందరికంటే ఎక్కువ విరాళం ఇచ్చింది ఇతడే!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమంది రామభక్తులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన ఆ ఘట్టం పూర్తయింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా అయోధ్యపురిలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగిసింది. ఈ మహత్తర కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 7 వేల మంది ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాదు.. గతంలో ఏ కార్యక్రమానికి హాజరుకానంతగా భారీగా సాధువులు పాల్గొన్నారు. దాదాపు 3 వేల మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వహించగా.. 1100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. ఆలయానికి వచ్చిన విరాళాలపై ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దాదాపు 3 వేల కోట్లకు పైగా ఆలయ నిర్మాణానికి విరాళాలు రాగా.. అందులో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ భారీగా కానుకలు సమర్పించినట్లు తెలుస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 101 కేజీల బంగారు ఆభరణాలు సమర్పించినట్లు సమాచారం. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.68 వేలు ఉండగా.. ఆయన సమర్పించిన బంగారం విలువ దాదాపు రూ.68 కోట్ల వరకు ఉంటుంది. దిలీప్ కుమార్‌తో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరాయ్ బాపూ రూ.11.3 కోట్ల విరాళం ఇచ్చి రెండో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆలయ నిర్మాణానికి వచ్చిన విరాళాల్లో మొత్తం రూ.1800 కోట్లు ఖర్చు కాగా.. ఇంకా 1200 కోట్లకు పైగా మిగిలినట్లు సమాచారం.

Advertisement

Next Story