- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భక్తులకు అయోధ్య రామ తీర్థ ట్రస్ట్ గుడ్ న్యూస్!
అహ్మదాబాద్: అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం భక్తులకు కలగనుంది. ఆలయ నిర్మాణాన్ని చూసేందుకు భక్తులను అనుమతించాలన్న ఆలోచనలో తాము ఉన్నట్టు అయోధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు్ అధికారి ఒకరు తెలిపారు. ఇందుకోసం ఓ దర్శనం పాయింట్‌ను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని ఆయన చెప్పారు. ఈ విషయమై భద్రతా కోణాల్లో ఎలాంటి అవరోధాలు ఎదురవుతాయనే అంశంపై లోతుగా అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు. అనుమతులు ఇస్తే ఆలయ నిర్మాణ పనులకు ఆటంకాలు కలుగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఆలోచిస్తున్నట్టు వివరించారు.
కాగా దర్శనం పాయింట్ టెంపుల్‌కు సమీపంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దర్శనం పాయింట్ నుంచి చూస్తే మొత్తం ఆలయం నిర్మాణం పనుల వ్యూ కనిపించేలా ఈ నిర్మాణం ఉంటుందన్నారు. ఆలయాన్ని ఫోటోలు తీసుకోవడానికి పర్యాటకులకు అనుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు. అయితే ఆలయ సమీపానికి వెళ్లడానికి మాత్రం ఎవరికీ అనుమతి ఇవ్వబోమని, బారి కేడ్లను ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.