నాయకులు ఆదర్శవంతంగా ఉంటేనే మంచి పాలన: కట్టా శేఖర్ రెడ్డి

by Sridhar Babu |
katta-1
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలను పరిపాలించే నాయకులు ఆదర్శవంతంగా ఉంటేనే అవినీతిలేని పరిపాలన సాధ్యమవుతోందని తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి అన్నారు. ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లో అవినీతికి వ్యతిరేకంగా నడక అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. జనాలు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నామని అధికారులు, అధికారులు వేధిస్తున్నారని జనాలు అంటున్న నిజానికి అధికారుల లోపమే కారణమన్నారు. ఆదర్శ జీవితాన్ని ఎంచుకొని నాయకత్వం వహించినప్పుడు ప్రజలందరూ అతనిని అనుసరిస్తారని, ఉదాహరణ గాంధీజీ అన్నారు. దేశానికి నాయకత్వం వహించే వాళ్లు ఆదర్శంగా ఉండాలని, ప్రజలను తప్పుబట్టేవాళ్లు దుర్మార్గులు అన్నారు. సమాచార హక్కు చట్టం పెద్ద మహాసముద్రమని, నీకు, సమాజానికి అవసరమయ్యే విషయాలపై నీ ఆలోచన స్పష్టంగా, నువ్వు వేసే బాణం సూటిగా ఉండాలన్నారు. ఏ విషయాన్నయినా ప్రశ్నించే సామాన్యుడి ఆయుధం సమాచార హక్కు చట్టమని, దానిని అవినీతి ప్రక్షాళన దిశగా వినియోగించాలన్నారు.

అవినీతిపై సమాజంలో ప్రతిఘటించే ధోరణి తగ్గిపోతుందని బాధపడుతున్న సమయంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ అవినీతి నిర్మూలనపై ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ అవినీతి నిర్మూలన కోసం, అవగాహన, చైతన్య సదస్సులు నిర్వహిస్తూ, సహచట్టాన్ని బాగా ఉపయోగించుకొవాలన్నారు. ఆర్టీఐ చట్టం మాజీ కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అవినీతి నిర్మూలన యువత చేతిలోనే ఉందని, సమాజంలో మార్పు కోసం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ వినూత్న కార్యక్రమాలు చేయడం మంచి పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి, రంగారెడ్డి రెడ్ క్రాస్ చైర్మన్ నర్సింహరెడ్డి, మీడియా కార్యదర్శి జయరాం, కొమటి రమేష్ బాబు, కొన్నె దేవేందర్, ఎన్ సీసీ ఆఫీసర్ సంతోషిణి, వి. గంగాధర్, సతీష్, హరి, రాకేష్, రాజేష్, మారియా అంతోని, డాక్టర్ ప్రతిభాలక్ష్మి, డాక్టర్ స్రవంతి, జి. హరిప్రకాశ్, రమేశ్ నాయక్, స్వప్నారెడ్డి, ప్రదీప్ రెడ్డి, కళ్యాణి, సాయినాథ్ రెడ్డి, సంపత్, వెంకటేశ్, ప్రవీణ్, సినీనటులు శివ నాగరాజు, ప్రభాస్ రాజు, సుజాత, సురేష్ జ్యోతుల, వినయ్, ఎన్ సిసి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed