- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూఢ నమ్మకాలపై అవగాహన సదస్సు.. వాటిని పట్టించుకోవద్దన్న ఎస్ఐ
దిశ,పుల్కల్: సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలం పరిధిలోని కొర్పొల్ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో మూఢనమ్మకాలు, సైబర్ నేరాలపై కళాబృందం చేత అవగాహన సదస్సు నిర్వహించామని పుల్కల్ ఎస్ఐ నాగలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో చేతబడి చేస్తున్నారని, కానీ వీరిని పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు భావిస్తున్నారని ఆమె అన్నారు. కానీ మూఢనమ్మకాలను చట్టం నమ్మదని, ఆ విషయాన్ని గ్రామ ప్రజలకు అర్థమయ్యేలా తెలిపేందుకు కళాబృందం చేత అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఇటీవల జరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
కావున ఆయా గ్రామాల ప్రజలు ఎవరో చెప్పిన మాటలు వినకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాగే గ్రామాల్లో ప్రజలు మూఢనమ్మకాలను నమ్మవద్దని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాల్లో సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ ముకుంద, వార్డ్ నెంబర్ మోహన్, పోలీస్ శాఖ సిబ్బంది, కళాబృందం సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.